Saturday, April 11, 2009

తీరుచు నతఁడే దిన కర్మంబది

౫౩.
తీరుచు నతఁడే దిన కర్మంబది
నూరిటి రుణ మొక నూలిపోఁగునా

తొల్లిటి కర్మము దోడఁ గుడుచుటకె
తెల్లమి జీవుఁడు దేహము మోచుట
వొల్లనన్నఁ బోదున్నంత కాలము

కోరిన కోర్కికి గురియగునందుకె
సారపు సంసార సంగమిది
నేరిచి బ్రదికేటి నెపమునఁ బోదది

తెంచని యాసలఁ దిప్పుటకే పో
పంచేంద్రియముల పంతమిది
చించినఁ బోదది శ్రీవేంకటపతి. ౩-౪౫౯

No comments: