పాపపు కొంపలో వారు పంచమహా పాతకులు
కాపులకు పదుగురు కర్త లందరు
తాపికాండ్లారుగురు ధర్మాసనము వారు
చాపలమే పనులెట్టు జరిగీనయ్యా.
పలుకంతల చేను బండవెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటి పసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి అనాజ్ఞ కిందుఁ జోటేదయ్యా.
బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోఁత వేఁత చూచుకొని కోరుకొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా. ౩-౪౬౪
Monday, April 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment