Tuesday, April 14, 2009

తానెంత బ్రదుకెంత దైవమా నీ మాయ యెంత

౫౬.
పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను.౩-౪౬౭


౫౭.
తానెంత బ్రదుకెంత దైవమా నీ మాయ యెంత
మానవుల లంపటాలు మరి చెప్పఁగలదా.

చెలఁగి నేలఁ బారేటి చీమ సయితమును
కలసి వూరకే పారుఁ గమ్మర నెందో మరలు
తలమోఁచి కాఁపురము ధాన్యములు గూడ పెట్టు
యిలసంసారము దనకిఁక నెంత గలదో.

యేడో బాయిటఁ బారే యీఁగ సయితమును
వాడుదేర నడవుల వాలి వాలి
కూడ పెట్టుఁ దేనెలు గొందులఁ బిల్లలఁ బెట్టు
యేడకేడ సంసార మిఁక నెంత గలదో.

హెచ్చి గిజిగాండ్లు సయిత మెంతో గూఁడు వెట్టు
తెచ్చి మిణుఁగురుఁ బురువు దీపము వెట్టు
తచ్చి శ్రీవేంకటేశ నీ దాసులు చూచి నగుదు-
రిచ్చలఁ దాని సంసారమిఁక నెంత గలదో. ౩-౪౬౮

No comments: