Wednesday, April 15, 2009

చెలఁగి యధర్మము వుట్టింప నీకేల సృష్టింపఁగ మరి నీకేల

౫౮.
చెలఁగి యధర్మము వుట్టింప నీకేల సృష్టింపఁగ మరి నీకేల
పులులను లేళ్ళ నొక్క కదుపుగా పులు మేపుదురటే మాధవుడా

గొనకొని పాషండుల దుర్భాషల క్రోధము సహింపరాదు
దనుజుల పుట్టువు వారలనుచు నిజతత్త్వజ్ఞానము నీ వియ్యవు
అనిశముఁ జూచిన వారికి మాకును అంతర్యామివి నీవు
పెనచి చీఁకటియు వెలుఁగును నొకచోఁ బెంచెదవేలా ముకుందుడా.

ఖలులు తామసపు దేవతార్చనలు కనుఁగొని యవి యోర్వగరాదు
నెలకొని వారలు నరకవాసులని నీ మీఁది భక్తియు నీ వియ్యవు
పొలుపుగ నిందరిలోపలఁ గ్రమ్మరఁ బూజగొనేటి వాడవు నీవే
చలమునఁ బుణ్యము పాపము నొకచో సరిచేతురటవే గోవిందుడా.-౪౬౯

No comments: