౬౩.
పగలే రేయి యీబడిఁ గొన్ని జీవులకు
వొగి నా రేయి పగలౌ నొకరికిని
నిలువెల్లా జేఁదే నెరిఁ గొన్ని వృక్షములు
కలదెల్లఁ దీపే కమ్మరఁ గొన్ని
ఇహమే పరము యెరిగితేఁ గొందరికి
మహిఁ బరమే ఇహము మరొకరికి.౩-౫౫౦
౬౪.
పలుచవులందు నెల్ల ప్రాణమే మిక్కిలి చవి
బలిమి తీపుల లోనఁ బ్రాణమే తీపు
యిలపైఁ బూజ్యుల లోన నింతులే కడుఁ బూజ్యులు.
తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము
జగతిఁ గట్టనికట్టు సంసారము
వగలైన గుణాలలో వైరమే నిజ గుణము.
తమలో నెవ్వరికైనాతమ జాతి తమ నేర్పు
తమకు నెక్కుడై తోఁచు తక్కువనరు.
ఎటువంటి అమృతగుళికలలాంటి మాటలు చెప్తున్నారన్నమయ్య గారు. ఆయన సంకీర్తనలలో నిక్షిప్తం చేసిన ఇటువంటి రత్నాలనేరుకొని మనమందరం మననం చేయటం, మన పిల్లలతో కూడా మననం చేయించటం మన బాధ్యత.
Saturday, April 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment