Monday, June 1, 2009

మరల విచారించితే మంచము కిందే నుయ్యి

67.
మరల విచారించితే మంచము కిందే నుయ్యి 3-569

68.
నారాయణ నీ నామ మహిమలకు
గోరఁ బోవుటకు గొడ్డలి దగునా
పరిగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
దొరకొని వూరకె తొడగిన యట్లు
కొచ్చి కొచ్చి యొక కొండంత కనకము
వెచ్చపుఁ బోకకు వెలయిడినట్లు
కదిసి సముద్రము గడచి వోడలో
జిదిసి యినుము దెచ్చినయట్లు. 3-574

69.

కొండంత పసిఁడి కలగూరకె వెలయిడిన-
నిండిన వివేకులకు నేరమిది గాదా
గుఱుతుగల రత్నంబు గుగ్గిళ్ళు గొనఁగ వెల-
పఱచుటే తనబుద్ధి పాడౌట గాదా
కామధేనువుఁ దెచ్చి కాసుకె వెలకొసఁగ
కామించ నధికులకు కడుఁ గొరత గాదా. 3-

అన్నమయ్యఅధ్యాత్మసంకీర్తనలు - 3వ సంపుటం సమాప్తం.

No comments: